కాంగ్రెస్ మాజీలకు పెద్దపీట... టీడీపీ లోక్ సభ జాబితాలో కనిపిస్తున్న పేర్లు!

  • కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన వారికి పెద్దపీట
  • జాబితాలో కోట్ల, పనబాక, రాయపాటి, కిశోర్ చంద్రదేవ్
  • నిన్న రాత్రి అభ్యర్థుల పేర్లు ప్రకటించిన టీడీపీ
నిన్న రాత్రి ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, అందులో పలువురు తాజా మాజీ కాంగ్రెస్ నేతల పేర్లు కనిపిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన వారికి చంద్రబాబు పెద్ద పీట వేశారని ఈ జాబితాను విశ్లేషించిన రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అరకు నుంచి కిశోర్ చంద్రదేవ్, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, తిరుపతి నుంచి పనబాక లక్ష్మి, నర్సరావుపేట నుంచి రాయపాటి సాంబశివరావులకు చంద్రబాబు టికెట్లను ఖరారు చేశారు. వీరంతా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పేరున్న నేతలే. వీరిలో కేంద్ర మంత్రులుగా పదవీ బాధ్యతలు నిర్వహించిన వారు కూడా ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరంతా టీడీపీలో చేరారన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Telugudesam
Lok Sabha
Elections
Congress

More Telugu News